కమలహాసన్ దారిలోనే... డిసెంబర్ 12న రాజకీయ పార్టీని ప్రకటించనున్న రజనీకాంత్!
- ఇటీవల రాజకీయ ప్రకటన చేసిన కమల్
- తన పుట్టినరోజున ప్రకటన చేయనున్న రజనీకాంత్
- ఏ పార్టీలో చేరే అవకాశాలు లేవంటున్న సన్నిహితులు
- సొంత పార్టీవైపే రజనీ మొగ్గు
ఈ సంవత్సరం ఆగస్టులో తన రాజకీయ ప్రవేశంపై తొలిసారిగా కొంత స్పష్టతను ఇచ్చిన రజనీకాంత్, అభిమానులతో వరుసగా సమావేశాలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్ రాజకీయ పార్టీని పెడితే, ఆయనతో చేతులు కలిపేందుకు తనకు అభ్యంతరం లేదని కమల్ ప్రకటించారు కూడా.