అమానవీయ ఘటన... చెల్లిని గొలుసులతో కట్టేసిన అన్న!
- జగిత్యాలలో ఘటన
- బంధించి ఇంట్లోని ఓ గదిలో ఉంచిన వైనం
- తప్పించుకుని బయటకు వచ్చిన యువతి
- ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని చెబుతోన్న కుటుంబ సభ్యులు
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి పేరు గీత (25) అని చెప్పారు. గీత అన్న తన భార్యతో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. గీతకు మతిస్థిమితం సరిగా లేని కారణంగానే తాము ఆమెను కట్టి ఉంచామని కుటుంబ సభ్యులు పోలీసులతో చెప్పారు.