తొలి సినిమా చేసినప్పుడు కథ ఏంటో కూడా తెలీదు: కార్తీ
- యూఎస్ లో విద్యాభ్యాసం పూర్తైన తరువాత సినిమాల్లోకి వచ్చాను
- తొలి సినిమా చేసినప్పుడు కథేంటో కూడా తెలియదు
- అన్నయ్య ఏం చెప్పాడో అదే చేశాను
నటన రాదు కదా ఎలా? అని అడిగితే.. 'నేర్చుకోడానికి ట్రై చెయ్...నేర్చుకోవడం మొదలు పెడితే నటన వస్తుంది. డైరెక్టర్ ఏం చెబితే అది అలాగే చెయ్' అని అన్నయ్య సూచించాడని కార్తీ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ రెండేళ్లు నడిచిందని అన్నాడు. అన్నయ్య చెప్పినట్టే ఆ సినిమా సూపర్ హిట్ అయిందని అన్నాడు. ఏడాదిపాటు ఆడిందని, అవార్డులు కూడా వచ్చాయని గుర్తుచేసుకున్నాడు. ఆ తరువాతి సినిమా షూటింగ్ మూడేళ్ల పాటు జరిగిందని చెప్పాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిందని తెలిపాడు.