ఐశ్వర్య పోలికలతో మోడలింగ్ రంగంలో పర్షియన్ భామ!
- కొత్త ఐశ్వర్యారాయ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు
- ఐశ్వర్య పోలికలతో పర్షియన్ మోడల్ మహల్గా జుబేరీ
- ఇండియాలో పాప్యులర్ అంటూ హర్షం
ఇక అసలు విషయానికి వస్తే, కాలిఫోర్నియాలోని సాన్ డియోగోకు చెందిన పర్షియన్ మోడల్ మహల్గా జుబేరీ అచ్చం ఐశ్వర్యారాయ్ లా ఉందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఆమె కూడా స్పందించింది. తన ఫోటోలు ఇండియన్ సర్కిల్ లో బాగా పాప్యులర్ అయ్యాయని, ఒక ఇండియన్ న్యూస్ పేపర్ లో కూడా వచ్చాయని హర్షం వ్యక్తం చేసింది.