కేంద్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: ప్రకాశ్ రాజ్
- పెద్దనోట్ల రద్దుపై ప్రకాశ్ రాజ్ విమర్శలు
- సామాన్యులు ఇబ్బందులు పడ్డారు
- ధనవంతులు అనేక మార్గాల ద్వారా డబ్బుని మార్చుకున్నారు
- కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది
నల్లధనాన్ని నిరోధించేందుకు, ఉగ్రవాదులకు నిధులు వెళ్లకుండా చూసేందుకు గత ఏడాది మోదీ పెద్దనోట్ల రద్దును చేశానని చెప్పుకున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే, ధనికులు ఎన్నో మార్గాల ద్వారా నల్లధనాన్ని మార్చుకున్నారని చెప్పారు. దీంతో సామాన్య ప్రజలు అనేక బాధలుపడ్డారని చెప్పారు. కాగా, ఇటీవల కమలహాసన్ చేసిన హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.