అందుకే నా సినిమాలు చూడొద్దని నా వైఫ్ కి చెబుతుంటాను : హీరో కార్తీ
- లవ్ సీన్స్ లో ఇన్వాల్వ్ కావల్సిందే
- నా భార్య క్వశ్చన్ చేస్తుంది
- గొడవ పడటమూ మామూలే
- నేను అర్థం చేసుకోగలను
"ప్రేమ .. పెళ్లి వంటి సీన్స్ లో పూర్తిగా ఇన్వాల్వ్ కాకపోతే .. ఆ సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. అందువలన ఆడియన్స్ కు ఆ ఫీల్ కలిగేలా నటించవలసి వస్తూ ఉంటుంది. ఈ విషయాలను అర్థమయ్యేలా నేను చెప్పినా .. ఒక వైఫ్ గా ఆమెకది కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు. ఆమె స్థానంలో నేనున్నా అలాగే ఫీలవుతాను. ఈ విషయంలో తనకీ నాకు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. దాంతో నా సినిమాలు చూడొద్దనే నేను ఆమెకి చెబుతూ వుంటాను" అంటూ నవ్వేశారు.