అన్నయ్యకు .. నాకు అస్సలు పడేది కాదు!: కార్తీ
- అన్నయ్య అభిరుచులు, అభిప్రాయాలు వేరు
- నా ఆలోచనలు, పద్ధతులు వేరు
- అందువలన ఎప్పుడూ గొడవలే
- అన్నయ్య విలువ అప్పుడు తెలిసింది
ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, "నేను ఒక్క సినిమాల విషయంలోనే అన్నయ్యను ఫాలో అయ్యాను. మా ఇద్దరి అభిరుచులు .. అభిప్రాయాలు వేరు. చిన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రతి విషయంలోను గొడవ జరిగేది. తాను చెప్పింది వినాలనేవాడు .. నేను వినేవాడిని కాదు. ఇక ఏదైనా షేర్ చేసుకునే విషయంలోను తనకి ఎక్కువ .. నాకు తక్కువ. అందువలన ఇద్దరికి ఎంతమాత్రం పడేది కాదు. నేను పై చదువుల కోసం యూఎస్ వెళ్లిన తరువాత నాకు అన్నయ్య విలువ తెలిసొచ్చింది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యా అనుబంధం పెరిగింది'' అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు.