ఇద్దరూ మంచి స్నేహితులు .. అయినా పోటీ తప్పడం లేదు!
- 'బాలకృష్ణుడు'గా నారా రోహిత్
- 'మెంటల్ మదిలో' తో శ్రీ విష్ణు
- రెండు సినిమాలు ఈ నెల 24నే
- అందరిలోను పెరుగుతోన్న ఆసక్తి
ఈ నేపథ్యంలో నారా రోహిత్ చేసిన 'బాలకృష్ణుడు' సినిమా, ఈ నెల 24వ తేదీన విడుదలవుతోంది. ఇక శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన 'మెంటల్ మదిలో' సినిమాను కూడా అదే రోజున విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కలిసి హిట్ కొట్టిన ఈ స్నేహితులు .. ఇప్పుడు ఒకే రోజున వేరు వేరు సినిమాలతో రంగంలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ స్నేహితులు మాత్రం ఒకరి సినిమా హిట్ కొట్టాలని మరొకరు కోరుకుంటున్నారు.