మెగా ఫ్యాన్స్ మెచ్చేలా 'సైరా'లో పవర్ ఫుల్ డైలాగ్స్
- చిరూ కథానాయకుడిగా 'సైరా నరసింహా రెడ్డి'
- పదునైన సంభాషణలు రాసిన సాయిమాధవ్ బుర్రా
- డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయని టాక్
అందువలన చిరూ పాత్ర కోసం రచయిత సాయిమాధవ్ బుర్రాతో పవర్ఫుల్ డైలాగ్స్ రాయించారట. ప్రాణాలను సైతం లెక్కచేయని ఓ పోరాటయోధుడు ఎలా మాట్లాడతాడో అలా చాలా పదునైన సంభాషణలను సాయిమాధవ్ బుర్రా రాశాడట. గతంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం ఆయన రాసిన మాటలు ఎంతటి ఉత్తేజాన్ని కలిగించాయో తెలిసిందే. అంతకి మించిన సంభాషణలను ఆయన అందించాడనీ .. ఈ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్ లో హుషారెత్తిస్తాయని చెప్పుకుంటున్నారు.