శర్వానంద్ కి కొత్తే .. ఆయన సరసన ఇద్దరు హీరోయిన్స్!
- సుధీర్ వర్మతో శర్వానంద్ తాజా చిత్రం
- మాఫియా డాన్ గా ఆయన పాత్ర
- ఒక కథానాయికగా షాలినీ పాండే
- మరో కథానాయికగా నివేదా థామస్
ఈ సినిమాలో యంగ్ లుక్ తోను .. మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గాను శర్వానంద్ కనిపించనున్నాడు. శర్వానంద్ ఇంతవరకూ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన దాఖలాలు కనిపించవు. కానీ ఈ సినిమా కోసం ఆయన ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఇప్పటికే షాలినీ పాండేను ఒక కథానాయికగా తీసుకోగా .. మరో కథానాయికగా నివేదా థామస్ ను సంప్రదిస్తున్నారు. దాదాపు ఆమె ఖరారు కావొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది