విఘ్నేశ్ .. నయనతారల పెళ్లి త్వరలోనే అంటూ కోలీవుడ్ టాక్!
- విఘ్నేశ్ ప్రేమలో నయన్
- బర్త్ డే గిఫ్ట్ లు .. విదేశాల్లో విహారాలు
- మళ్లీ ఊపందుకున్న ప్రచారం
- వరుస సినిమాలతో బిజీగా నయన్
ఇక వీళ్లిద్దరూ త్వరలోనే 'ఆర్య సమాజ్' లో పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజా సమాచారం. పెళ్లైన తరువాత తాము ఉండటానికి గాను ఒక ఖరీదైన విల్లాను ముందుగానే కొనేశారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే విఘ్నేశ్ .. నయనతారల పెళ్లి గురించిన వార్తలు కోలీవుడ్ లో చాలాసార్లు షికారు చేశాయి. ఈ సారైనా ఈ జంట పెళ్లి గురించిన వార్త నిజమవుతుందేమో చూడాలి. ప్రస్తుతం నయనతార చేతిలో అరడజను తమిళ సినిమాలతో పాటు, తెలుగులో బాలకృష్ణ .. చిరూ సినిమాలు కూడా వున్నాయి.