బహిరంగ లేఖతో నారా లోకేశ్ ను నిలదీసిన పశ్చిమ గోదావరి యువకుడు... సోషల్ మీడియాలో వైరల్!
- నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాసిన ఉదయ్ కిరణ్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బహిరంగ లేఖ
- నారా లోకేష్ పై ప్రశ్నల వర్షం
వైజాగ్ కు ఎన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయని నిలదీశాడు. త్రిపుర సీఎం జీతమెంత? అప్పుల్లో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీతమెంత? అని నిగ్గదీశాడు. కేరళలో అవినీతి 4 శాతం ఉంటే ఏపీలో 27 శాతం ఎందుకుందని ప్రశ్నించాడు. విషం చిమ్మే ఆక్వా కంపెనీని పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాల మధ్య ఎందుకు పెట్టారు? లేగ దూడల గిట్టల చప్పుడు వినాల్సిన గోదావరి జిల్లాల ప్రజలు తెల్లారి లేవగానే కరకు పోలీసు బూట్ల చప్పుడు ఎందుకు వింటున్నారని ఆయన ప్రశ్నించాడు. తన బహిరంగ లేఖకి సమాధానం ఇస్తారని భావిస్తున్నానని ఆయన ఆకాంక్షించాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చదవండి.