వ్యాయామాలు నేర్పించేందుకు రెడీ అవుతున్న సన్నీ లియోన్
- టీవీ షోతో త్వరలో ప్రేక్షకుల ముందుకు
- `ఫిట్స్టాప్` పేరుతో ఎంటీవీ బీట్స్లో టీవీ షో
- మంచి ఎక్సర్సైజులను నేర్పిస్తానంటున్న బాలీవుడ్ తార
`మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఎంతో అవసరం. ప్రతి ఒక్కరు తమ రోజులో కొంత సమయాన్ని వ్యాయామం కోసం తప్పకుండా వెచ్చించాలి. అందుకే ఎంటీవీతో కలిసి `ఫిట్స్టాప్` పేరుతో ఓ కార్యక్రమం చేస్తున్నా. దీంట్లో అన్ని రకాల వ్యాయామాలను నేను పరిచయం చేస్తాను` అని సన్నీ చెప్పింది. గతంలో `సూపర్ హాట్ సన్నీ మార్నింగ్స్` పేరుతో సన్నీ లియోన్ టైమ్స్ లివింగ్ వారి యూట్యూబ్ ఛానల్లో ఒక ఫిట్నెస్ కార్యక్రమం చేసింది. కేవలం ఆరు ఎపిసోడ్లు మాత్రమే కొనసాగిన ఈ కార్యక్రమంలో ఎన్నో మంచి వ్యాయామాలను సన్నీ పరిచయం చేసింది.