హారర్ థ్రిల్లర్ పైనే సిద్ధార్థ్ ఆశలు .. ఒకే రోజున మూడు భాషల్లో రిలీజ్
- సక్సెస్ కోసం సిద్ధార్థ్ ఎదురుచూపులు
- సొంత నిర్మాణంలో సినిమా
- దెయ్యం కాన్సెప్ట్ పైనే నమ్మకం
- కథానాయికగా ఆండ్రియా
తెలుగులో 'గృహం' .. హిందీలో 'ది హౌస్ నెక్స్ట్ డోర్' అనే పేర్లతో ఈ సినిమాను నవంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో .. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్టు చెబుతున్నారు. ఒక ఇంట్లో దెయ్యం సృష్టించే భయానక సన్నివేశాల సమాహారంగా ఈ కథ కొనసాగనుంది. ఈ సినిమా ఈ మూడు భాషల్లోను తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే ఆశతో సిద్ధార్థ్ వున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.