ఫోన్ సాధారణ వ్యక్తిది... నంబర్ రవితేజది... `రాజా ది గ్రేట్` సినిమా వల్ల ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి!
- సినిమాలో ఫోన్ నంబర్ చెప్పడం వల్ల ప్రారంభమైన కష్టాలు
- రోజుకి వందల్లో ఫోన్ కాల్స్
- కాల్స్ బాధ తట్టుకోలేక ఫోన్ స్విచ్ఛాఫ్
సినిమా విడుదలైన నాటి నుంచి రోజుకి వందల కొద్దీ కాల్స్ వస్తున్నాయని గోపీ చెబుతున్నాడు. `ఒకటీ.. రెండూ.. కాల్స్ అయితే ఓకే.. కానీ వందల్లో కాల్స్ వస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు` అని గోపీ అన్నాడు. కాల్స్ బాధ తట్టుకోలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవాల్సి వస్తోందని చెప్పాడు. రవితేజ అభిమానులెవరూ తనకు ఫోన్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. పరిస్థితి శ్రుతి మించితే అనుమతి లేకుండా తన నెంబర్ సినిమాలో వాడుకున్నందుకు కేసు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గోపీ చెప్పాడు.