హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న రానా సోదరుడు!
- విలక్షణ నటుడిగా ఎదుగుతోన్న రానా
- నటన దిశగా ఆయన సోదరుడు అభిరామ్
- కొనసాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు
- త్వరలోనే అధికారిక ప్రకటన
నటన దిశగా అభిరామ్ రానున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు షికారు చేశాయి .. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి. అభిరామ్ ను హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శంకర్ నాథ్ దుర్గ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఆయన మోహన్ బాబు .. శర్వానంద్ కాంబినేషన్లో 'రాజు - మహారాజు' సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.