'సైరా'లో చిరూ లుక్ .. గెటప్ లలో మార్పులు?
- చిరూ తాజా చిత్రంగా 'సైరా నరసింహా రెడ్డి'
- దర్శకుడిగా సురేందర్ రెడ్డి .. నిర్మాతగా చరణ్
- ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లవలసి వుంది
ఎన్నో ఫోటో షూట్స్ చేసిన తరువాత చిరూ లుక్ ను .. గెటప్ ను ఖరారు చేసుకున్నారు. వాటిపైనే చిరంజీవి పూర్తి దృష్టి పెట్టారు. తీరా ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అనుకుంటూ ఉండగా, లుక్ లోను .. గెటప్ లోను మార్పులు వున్నాయంటూ చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమవుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనేలేదు.