సంజయ్ దత్ బయోపిక్ టైటిల్ ఖరారు!
- 'సంజు' అనే పేరు ఖరారు!
- హీరోగా నటిస్తున్న రణబీర్ కపూర్
- ఇండస్ట్రీలో సంజయ్ ముద్దు పేరు సంజూయే
- అదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు
కాగా, ఇండస్ట్రీలో సంజయ్ ని సంజూ బాబా అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు అదే టైటిల్ పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. పరేష్ రావెల్, మనీషా కోయిరాలా తదితర సీనియర్లలతో పాటు సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ వంటి తారలు నటిస్తున్న చిత్రం వచ్చే సంవత్సరం మార్చి 30న విడుదల కానుంది.