శర్వానంద్ జోడీగా నివేదాకు ఎక్కువ ఛాన్స్!
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- కథానాయిక పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ తో సంప్రదింపులు
- ఆమె డేట్స్ సర్దుబాటు కావడం లేదట
- నివేదా థామస్ ను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు
ఈ సినిమాలో శర్వానంద్ డిఫరెంట్ షేడ్స్ తో .. డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. 'శతమానం భవతి'లో శర్వానంద్ తో అనుపమ జోడీ అదిరిందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. దాంతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారటగానీ .. డేట్స్ సర్దుబాటు కావడం లేదట. ఈ నేపథ్యంలో నివేదా థామస్ ను తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.