'సైరా' కోసం చిరూ బట్టలు .. చెప్పుల ఖర్చే 5 కోట్లట!
- 'సైరా'ను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు
- ఈ నెల చివర్లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు
- చిరూ పాత్రకి అవసరమైన చెప్పులు .. బట్టల కోసం బాలీవుడ్ డిజైనర్లు
- కేవలం వీటికోసం అవుతోన్న ఖర్చే 5 కోట్లు
సినిమాలో ఆయా సన్నివేశాలకి తగిన విధంగా చెప్పులను .. బట్టలను డిజైన్ చేయిస్తున్నారట. ఇందుకోసం బాలీవుడ్ లో భారీ సినిమాలకి పనిచేసిన డిజైనర్లను చరణ్ రంగంలోకి దింపాడని అంటున్నారు. చిరూ పాత్ర కోసం చెప్పులను .. బట్టలను ప్రత్యేకంగా డిజైన్ చేసేందుకుగాను వాళ్లు ఛార్జ్ చేసిన మొత్తం 5 కోట్లని తెలుస్తోంది. ఈ సినిమాకి ఏ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క విషయం సరిపోతుందేమో.