మూడు రోజుల్లో 10 కోట్లు కొల్లగొట్టిన 'మహానుభావుడు'
- భారీ సినిమాల మధ్య 'మహానుభావుడు'
- ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది
- కథతో ముడిపడిన కామెడీనే ప్రధాన బలం
తొలి మూడు రోజుల్లో తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమా 7.85 కోట్ల షేర్ ను కొల్లగొట్టగా, మిగతా ప్రాంతాలన్నీ కలుపుకుని 10 కోట్ల 30 లక్షల షేర్ ను సాధించింది. 'జై లవ కుశ' మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాగా, 'స్పైడర్' క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చింది. ఇక యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రావడం 'మహానుభావుడు' సినిమాకి బాగా కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు.