'అడవి' సోదరులిద్దరూ రంగంలోకి దిగేశారు!
- అడివి సాయికిరణ్ దర్శకత్వంలో మరో సినిమా
- హీరోగా ఆయన సోదరుడు అడివి శేష్
- సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు
- త్వరలోనే పూర్తి వివరాలు
గతంలో సాయికిరణ్ 'వినాయకుడు' .. 'కేరింత' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు యూత్ లో ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. గవర పార్థసారధి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.