‘పండుగ’ చేసుకున్న మందుబాబులు.. ఒక్కరోజే రూ.350 కోట్లు గొంతులోకి!
- ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే రూ.100 కోట్ల విక్రయాలు
- బార్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్
- టాప్ గేర్లో మాంసం విక్రయాలు
అక్టోబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ అమల్లోకి రానుండడంతో పాత స్టాకును వదిలించుకోవడమే లక్ష్యంగా డీలర్లు విక్రయాలు సాగించారు. దీంతో చివరి మూడు రోజుల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. బార్లలో వన్ ప్లస్ వన్ లాంటి ఆఫర్లు కూడా ప్రకటించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే రూ.వంద కోట్ల వ్యాపారం జరగ్గా గ్రామీణ ప్రాంతాల్లో రూ.250 కోట్ల విక్రయాలు జరిగాయి. మరోవైపు దసరా అంటేనే చుక్క-ముక్క అని భావించడంతో మాంసం విక్రయాలు కూడా ఎన్నడూ లేనంతగా సాగాయి. సికింద్రాబాద్, జియాగూడ, చెంగిచెర్ల తదితర హోల్సేల్ మాంసం మార్కెట్లలో శని, ఆదివారాల్లో రూ.30 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు అంచనా.