విఫలమైన నరేంద్ర మోదీ బాణం... జావెలిన్ త్రో చేసిన ప్రధాని!
- విరిగిన విల్లుతో లాభం లేదనుకున్న ప్రధాని
- అంబును విసిరి రావణ వధ
- ఎర్రకోటలో వైభవంగా దసరా ఉత్సవాలు
ఈ కార్యక్రమం వేదికపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర ప్రముఖులు ఆసీనులయ్యారు. దసరా ఉత్సవాల సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పండగలు సమాజంలో చైతన్యం నింపే ఉత్సవాలని అన్నారు. భారతీయ విలువలను దసరా, దీపావళి వంటి పర్వదినాలు కాపాడుతున్నాయని, జాతిని ఏకం చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేయాలని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించాలని పిలుపునిచ్చారు. రావణుడనే రాక్షసుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటామని మోదీ గుర్తు చేశారు.