మహేష్ హీరో.. విజయ్ విలన్ గా మురుగదాస్ కొత్త సినిమా?
- తెలుగు సినిమాలో మహేష్ బాబు హీరో విజయ్ విలన్
- తమిళంలో విజయ్ హీరో, మహేష్ బాబు విలన్
- కథ వినిపించిన మురుగదాస్
- ఇంకా ఓకే చెప్పని స్టార్ హీరోలు
దానిపై వారిద్దరూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోలీవుడ్ చెబుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో మహేష్ బాబు హీరో అయితే, తమిళంలో మహేష్ బాబు విలన్ గా నటించాల్సి ఉంటుందనే కండిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమా తీసిన మురుగదాస్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తమిళ సినీ పరిశ్రమ చెప్పుకుంటోంది. అయితే ఒకరు పోషించిన పాత్రను పోషించేందుకు తాను మొగ్గుచూపనని మహేష్ బాబు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.