'సవ్యసాచి'లో కీలకమైన రోల్ లో మాధవన్?
- చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
- కథానాయకుడిగా నాగ చైతన్య
- కీలకమై పాత్ర కోసం మాధవన్ తో సంప్రదింపులు
- సుముఖంగా వున్న మాధవన్
నిజంగానే మాధవన్ ను చందూ మొండేటి కలిసి కథ చెప్పాడట. మాధవన్ పాత్ర స్వరూప స్వభావాలను గురించి వివరించాడు. కథ బాగుందని చెప్పడమే కాకుండా .. తనకి ఇస్తానని చెప్పిన పాత్ర పట్ల కూడా మాధవన్ సంతృప్తిని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఇంకా ఆయన ఈ సినిమాకి సైన్ చేయకపోయినప్పటికీ, దాదాపు ఆయన ఖరారైపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది. చైతూ పెళ్లి తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.