'బిగ్ బాస్' హౌస్ సెంటిమెంట్ ఇద్దరికీ వర్కౌట్ కాలేదు!
- అల్లరి నరేశ్ కోరిక నెరవేరలేదు
- సునీల్ ఆశలు ఫలించలేదు
- సెంటిమెంట్ ను పాటించినా కలిసి రాలేదు
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రిలీజ్ కి ముందు రానా .. 'ఆనందో బ్రహ్మ' సమయంలో తాప్సీ .. 'అర్జున్ రెడ్డి' సమయంలో విజయ్ దేవరకొండ 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లారు. ఈ మూడు సినిమాలు హిట్ కావడంతో, విడుదలకి ముందు ఆయా హీరోలు 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లడమనేది సెంటిమెంట్ గా మారింది. 'మేడ మీద అబ్బాయి'కి అల్లరి నరేశ్ .. 'ఉంగరాల రాంబాబు'కి సునీల్ కూడా 'బిగ్ బాస్' హౌస్ లో అడుగుపెట్టారు. అయితే వీరి విషయంలో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి.