'పెళ్లికాని ప్రసాద్' తరహా పాత్రలో బాలయ్య?
- 102వ చిత్రం షూటింగులో బాలయ్య
- కథలోను .. పాత్రలోను కొత్తదనం
- 40 యేళ్ల బ్యాచిలర్ గా .. భగ్నప్రేమికుడిగా
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో ఆయన 'పెళ్లికాని ప్రసాద్' తరహా పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 40 ఏళ్లు వచ్చేవరకూ పెళ్లి కాకుండా ఉండిపోతాడట. ఆ తరువాత నయనతారను ప్రేమించి భగ్న ప్రేమికుడిగా మారిపోతాడని అంటున్నారు. అందుకు గల కారణాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. సెకండాఫ్ లో మళ్లీ నయనతార ఆయన జీవితంలోకి ఎంటరవుతుందని చెబుతున్నారు. మరో కథానాయికగా నటాషా దోషి నటిస్తోన్న ఈ సినిమా, సంక్రాంతికి విడుదల కానుంది.