రకుల్ క్రేజ్ 'ఖాకి' మూవీకి కలిసొచ్చేనా?
ఈ సినిమాలో కార్తీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తెలుగులో ఈ సినిమాకి 'ఖాకి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 18 అయితే అన్ని విధాలా బాగుంటుందని భావిస్తున్నారు. తెలుగులో రకుల్ కి గల క్రేజ్ ఈ సినిమాకి బాగా కలిసొస్తుందనే టాక్ వినిపిస్తోంది.