'పెళ్లి చూపులు' బాటలోనే 'మెంటల్ మదిలో'
ఇక తాజాగా రాజ్ కందుకూరి .. 'మెంటల్ మదిలో' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణు .. నివేతా పేతురాజ్ నాయకా నాయికలుగా నటించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సారి కూడా రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్టు కాపీని సురేశ్ బాబుకి చూపించారట. ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంటానని సురేశ్ బాబు చెప్పారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.