'ఉంగరాల రాంబాబు'కి దిల్ రాజు వాయిస్ ఓవర్!
నిర్మాతగా .. పంపిణీదారుడిగా దిల్ రాజు ఫుల్ బిజీగా వుంటారు. అలాంటి ఆయనతో ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పించారు. కథలో కీలకమైన సన్నివేశాలను లింక్ చేసే సందర్భాల్లో ఆయన వాయిస్ ఓవర్ వస్తుందట. ఆయనతోనే వాయిస్ ఓవర్ చెప్పించడానికి కారణమేంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుందని చెబుతున్నారు. వరుస పరాజయాలతో డీలాపడిన సునీల్, ఈ సినిమా సక్సెస్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలను ఈ సినిమా ఎంతవరకూ నెరవేరుస్తుందో చూడాలి.