పోటీకి కార్తీ రెడీగా వున్నా థియేటర్లు దొరకొద్దూ!
దీపావళికి విజయ్ 'మెర్సల్' రానుండటంతో, అంతకంటే ముందువారమే 'ఖాకీ'ని తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ అయ్యేలా కార్తీ చూస్తున్నాడు. అదే సమయంలో తెలుగులో 'రాజుగారి గది 2' .. 'రాజా ది గ్రేట్' .. 'ఆక్సిజన్' థియేటర్స్ లో వుంటాయి. ఈ మూడు సినిమాలు కూడా భారీ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ 'ఖాకీ' మూవీకి థియేటర్లు దొరుకుతాయా అనేదే సందేహం. థియేటర్లు దొరక్కపోతే అప్పటికి తమిళంలో మాత్రమే రిలీజ్ చేసుకుంటాడేమో చూడాలి.