హిరణ్యకశిపుడి పాత్రలో వెంకీ కాదట .. రానానే!
హిరణ్యకశిపుడిగా రానా అయితేనే సరిగ్గా సరిపోతాడని గుణశేఖర్ భావించి రానాను సంప్రదించాడట. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తోన్న రానా, ఎంతమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పౌరాణికాలు తెరకెక్కించడంలో 'బాలల రామాయణం'తోనే గుణశేఖర్ తన సత్తాను చాటుకున్నారు. కనుక ఈ సినిమాను ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.