సూర్య, జ్యోతికల సినిమా వచ్చేస్తోంది!
ఈ సినిమాలో జ్యోతిక తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. నిజానికి ఈ సినిమాను జూలైలోనే విడుదల చేయాలనుకున్నారుగానీ .. కుదరలేదు. దాంతో ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సూర్య - జ్యోతిక ఉన్నారట. ఇక వీళ్లిద్దరూ మళ్లీ కలిసి నటించే సమయం ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.