నయనతారకి ఈ టాలెంట్ కూడా ఉందండోయ్!
అలాంటి ఆమె తాజాగా 'అరమ్' మూవీ ప్రమోషన్లో పాల్గొనడం ఒక విశేషమైతే, కవితలు రాయడం తన హాబీ అని చెప్పడం మరో విశేషం. ఖాళీ సమయాల్లో తాను కవితలు రాస్తుంటాననీ .. అయితే ఇంతవరకూ వాటిని ఎవరికీ చూపించలేదని చెప్పింది. వీలు చూసుకుని నయనతార ఆ కవితలను ఒక పుస్తకంగా వేయిస్తుందేమో చూడాలి మరి. బయట ఎప్పుడు చూసినా చాలా సీరియస్ గా కనిపించే నయనతారలో ఈ టాలెంట్ కూడా ఉందన్న మాట.