మానవత్వమున్న రియల్ హీరో అనిపించుకున్నాడు!
కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వచ్చిన ఆయన, ఆత్మహత్యలు చేసుకుని పెద్ద దిక్కును పోగొట్టుకున్న వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయాన్ని అందించాడు. ఆదుకోవలసిన రైతుల కుటుంబాల వివరాలను ముందుగానే సిద్ధం చేసుకున్న ధనుష్, ఒక్కో ఇంటికి 50,000 రూపాయలను అందించాడు. మరో విడతలో మరికొంత మందికి సాయాన్ని అందించనున్నట్టు చెప్పాడు. దాంతో ఆ గ్రామస్తులంతా ధనుష్ ను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.