'వాసుకి' శాటిలైట్ రేటుపై నయన్ క్రేజ్ ప్రభావం!
అలా మలయాళంలో ఆమెకి విజయాన్ని తెచ్చిపెట్టిన 'పుదియ నియమం' సినిమాను, 'వాసుకి' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా ఇక్కడ ఇంకా రిలీజ్ కాక మునుపే, నయనతారకి గల క్రేజ్ కారణంగా జీ తెలుగు వారు ఫ్యాన్సీ రేటుకు శాటిలైట్ హక్కులను దక్కించుకున్నారు. సమాజంలో స్త్రీలకి జరుగుతోన్న అన్యాయాలను ధైర్యంగా ఎదిరించే మహిళగా ఈ సినిమాలో నయనతార కనిపించనుంది.