నన్ను ఓ విలన్‌గా చిత్రీకరిస్తున్నారు: 'సమాజ్ వాదీ' సంక్షోభం నేపథ్యంలో అమర్‌సింగ్
ప్రస్తుతం తనను ఓ విలన్‌గా చిత్రీకరిస్తున్నారనీ అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణల నుంచి తనను కాపాడాలని ములాయం సింగ్‌ను కోరారు. ఇటీవలే ములాయం సింగ్ అసెంబ్లీ ఎన్నికల జాబితాను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ అభ్యర్థుల జాబితా గురించి తనకు తెలియదని అమర్‌సింగ్ అన్నారు. జాబితాలో ఎవరికి టిక్కెట్లు దక్కాయో, ఎవరికి దక్కలేదో కూడా తనకి తెలియదని చెప్పారు. కొందరు వ్యక్తులు తనపై ఆరోపణలు గుప్పిస్తూ తనకు వ్యతిరేకంగా పోస్టర్లు ముద్రిస్తూ, తన దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.