పార్కులో విషాదం... సెల్ఫీకి ప్రయత్నించి కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు!
లాల్బాగ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, ఆ రాయిని సరిగా అమర్చలేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ... ఆ బాలుడిని రాతి స్తంబంపై కూర్చోబెట్టి సెల్ఫీకి ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.