జీ తెలుగులో దసరా డబుల్ ధమాకా.. ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’తో పాటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 సందడి!
పండుగంటే సంబరం.. ఆ సంబరానికి వినోదం తోడైతే ఆ ఆనందమే వేరు! ఈ దసరా సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన వినోదాల విందును సిద్ధం చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబించే ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’ ప్రత్యేక కార్యక్రమంతో పాటు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2ను ఒకే రోజు అందించనుంది జీ తెలుగు. అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటలకు దసరా వేడుకలు ప్రారంభం కాగా, రాత్రి 7:30 గంటలకు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 జీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబర్ 10న మహబూబ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించిన ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని, తెలుగు సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేలా సాగింది. యాంకర్ రవి ఎనర్జిటిక్ ఎంట్రీతో మొదలైన ఈ వేడుకలో జీ తెలుగుకి చెందిన పాపులర్ సీరియల్ జంటల సందడి, వినోదభరితమైన ఛాలెంజ్‌లు, సంగీతం, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ‘క్రేజీ కళ్యాణం’ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్, ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా అమ్మవారి ప్రత్యేక జానపద ప్రదర్శన, బతుకమ్మ వేడుకలు, కోలాటం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జీ తెలుగు సీరియల్ నటీమణులు, మహబూబ్‌నగర్ మేయర్ గుమల మమత, ‘క్రేజీ కళ్యాణం’ సినిమా బృందం, స్థానిక మహిళలు కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా జీ తెలుగు నిర్వహించిన ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’ కార్యక్రమం అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది.
దసరా ప్రత్యేక కార్యక్రమం అనంతరం ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2తో మరో ఆసక్తికరమైన వినోద ప్రయాణం ప్రారంభం కానుంది. ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో తొలి అతిథిగా ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి పాల్గొననున్నారు. ఆమెతో జరిగే సంభాషణలు, వ్యక్తిగత అనుభవాలు, ఆసక్తికరమైన విశేషాలు ఈ కొత్త సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ కార్యక్రమం అక్టోబర్ 16న జీ5 తెలుగులో ప్రీమియర్ కానుండగా, అక్టోబర్ 18న రాత్రి 7:30 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి శుక్రవారం జీ5 తెలుగులో కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా, ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. జగపతిబాబు ప్రత్యేక హోస్టింగ్ స్టైల్, సాయిపల్లవి తొలి ఎపిసోడ్‌తో ఈ సీజన్ ప్రేక్షకులకు ఆసక్తికరమైన అనుభూతిని అందించనుంది. సంప్రదాయాలు, సంబరాలతో నిండిన ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2తో జీ తెలుగు ఈ ఆదివారాన్ని మరింత వినోదంగా మార్చనుంది.