‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి : డైరెక్టర్ వి. వి. వినాయక్
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
వి.వి. వినాయక్ మాట్లాడుతూ .. ‘లగడపాటి శ్రీధర్ గారికి మా అందరికంటే సినిమా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి నాకు తెలుసు. విక్రమ్ పెద్ద హీరో అయి శ్రీధర్ గారి కోరికని నెరవేర్చుతాడు. తారక్ పొన్నప్ప అందరినీ భయపెట్టేస్తున్నాడు. దర్శక, నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. ‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
మైత్రి రవి మాట్లాడుతూ .. ‘లగడపాటి శ్రీధర్ మాకు మంచి మిత్రులు. విక్రమ్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. తారక్ తన పర్ఫామెన్స్‌తో అందరినీ భయపెడుతున్నాడు. ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. శ్రీధర్ అన్న ఇంత త్వరగా హీరోని చేస్తాడని అనుకోలేదు. ముందు ఆయనే హీరో అయి తర్వాత కొడుకుని తీసుకు వస్తారని అనుకున్నాం (నవ్వుతూ). ‘రంగస్థలం’ టైంలో సినిమా చూసి రూటెడ్ కథలు చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ‘అనకాపల్లి’లోనూ అంతే రూటెడ్, డెప్త్ కనిపిస్తోంది. మొత్తం అనకాపల్లిలోనే షూట్ చేయడం గొప్ప విషయం. ‘ఇరుముడి’కి కూడా మేం చాలా వరకు కొత్త వారిని తీసుకుని లైవ్ లొకేషన్స్‌లో చేశాం. ‘అనకాపల్లి’కి కూడా పెద్ద ఆదరణ లభించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ .. ‘అనకాపల్లితో నాకు మంచి ఎమోషన్ ఉంది. నేను అక్కడే డిగ్రీ చదివాను. నేను కూడా అనకాపల్లి ఎమోషన్ మీద కథ రాయాలని అనుకున్నా. కానీ త్రినాథ్ గారు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ‘అనకాపల్లి’ చిత్రంతో త్రినాథ్ రావు గారు ప్రయోగం చేశారు. ఇకపై నటుడిగానూ త్రినాథ్ బిజీగా అవుతారని ఆశిస్తున్నాను. విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. తారక్ అందరినీ భయపెడుతున్నాడు. సంధ్య గారు, ఇంద్రజ గారిని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి. అక్టోబర్ 2న ఈ చిత్రం రాబోతోంది. ‘అనకాపల్లి’ సౌండ్ రెండు రాష్ట్రాల్లో గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘త్రినాథరావు గారు నిర్మాత, నటిస్తున్నాడు అని తెలియడంతో ఆశ్చర్యపోయాను. ట్రైలర్‌లో ఆయన అద్భుతంగా కనిపించారు. నాయుడు గారు ఇంకా ఇలానే మంచి సినిమాల్ని చేయాలని కోరుకుంటున్నాను. నాకు శ్రీధర్ గారు అంటే చాలా ఇష్టం. ‘హృదయకాలేయం’ తర్వాత ఆయనే నాకు మొదటగా కాల్ చేసి ఆఫర్ ఇచ్చారు. నా మూవీ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ని శ్రీధర్ గారు అభినందిస్తుంటారు. విక్రమ్ అతి తక్కువ సమయంలోనే పెద్ద హీరో అవుతాడు. ‘అనకాపల్లి’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ .. ‘త్రినాథరావు గారి ఆలోచనకు రూపమే ‘అనకాపల్లి’. ఈ మూవీని ఆల్రెడీ నేను చూశాను. త్రినాథరావు గారి రూపంలో ఇండస్ట్రీలోకి మరో గొప్ప ఆర్టిస్ట్ దొరికారు. ఖగేష్‌కి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తాయి. దేవ్‌జండ్ మ్యూజిక్ బాగుంది. తల్లి పాత్రలో ఇంద్రజ గారు అందరినీ ఆకట్టుకుంటారు. సంధ్య ఈ సినిమాలో నిజంగానే అనకాపల్లి అమ్మాయిలా కనిపిస్తుంది. విక్రమ్ కోసమే నేను ఇక్కడకు వచ్చా. ‘అనకాపల్లి’ చిత్రంలో విక్రమ్ ఎంతో కష్టమైన పాత్రను ఎంతో ఇష్టంగా, అద్భుతంగా చేశాడు. తారక్‌ని తెరపై చూస్తే భయమేసింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ ఈవెంట్‌కి వచ్చిన మా అతిథులు వినాయక్ గారు, శివ నిర్వాణ గారు, మైత్రి రవి గారు, సాయి రాజేష్ గారు, ఆర్పీ పట్నాయక్ గారు ఇలా అందరికీ థాంక్స్. ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఎప్పుడూ అండగా ఉండే నా స్నేహితులకు థాంక్స్. ‘అనకాపల్లి’ ఒక ప్రేమ కథ, ఫ్రెండ్షిప్ కథ.. ఓ ఫ్యామిలీ కథ. ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అక్టోబర్ 2న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. ‘ఆట మంచి రసవత్తరంగా ఉన్నప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. ‘అనకాపల్లి’ చిత్రంలో ప్రతీ పాత్ర మధ్య అంతే పోటీ ఉంటుంది. ఒకరిని చూసి మరొకరు పోటీ పడి నటించారు. ‘అనకాపల్లి’ చిత్రాన్ని ఒక్క సెకన్ కూడా డీవియేట్ అవ్వకుండా చూస్తారు. ఈ చిత్రంలో పాటలు, మాటలు, ఫైట్స్ ఇలా అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది. ఇందులో ఇంకో డౌట్ పెట్టుకోకండి. అందరూ థియేటర్లో మా మూవీని తప్పకుండా చూడండి’ అని అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ సినిమాని ఆల్రెడీ మేం చూశాం. సరికొత్తగా ఉంటుంది. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనే లైన్స్ గుర్తు పెట్టుకోండి. ప్రియుడు మరింత వయలెంట్‌గా ఉంటే ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయ్ అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. ప్రియుడు ఎలా ఉండాలని ఇందులో గొప్పగా చూపించారు. తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించారు. ఏ సినిమాకి అయినా ప్రతినాయకుడు ముఖ్యం. తారక్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు. సంధ్య కూడా గొప్పగా నటించింది. ఇంద్రజ గారు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. త్రినాథ్ గారు కొత్తగా కనిపిస్తారు. మా కోసం వచ్చిన వినాయక్ గారు, శివ నిర్వాణ గారు, సాయి రాజేష్ గారు, మైత్రి రవి గారికి థాంక్స్. విక్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. సినిమా పట్ల విక్రమ్‌కి ఎంతో కమిట్మెంట్ ఉంటుంది. ఈ చిత్రంతో విక్రమ్ నన్ను సర్ ప్రైజ్ చేశాడు. ‘అనకాపల్లి’ సినిమా అక్టోబర్ 2న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ .. ‘మా సినిమాని రిలీజ్ చేస్తున్న మైత్రి సంస్థకి ధన్యవాదాలు. రసూల్ గారు చేసిన ‘భగీరథ’ చిత్రం నా జీవితాన్ని మార్చింది. నా అనకాపల్లి ప్రజలు నన్ను నమ్మి వారి భూమినంతా నా చేతుల్లో పెట్టారు. ‘భగీరథ’ చిత్రంలో నాజర్ గారు రవితేజ గారికి ఐదు లక్షల చెక్ ఇచ్చినట్టు, నా గురువు దాడి వీరభద్రయ్య గారి కొడుకు దాడి జగన్ ప్రభాకరు నాకు ఐదు లక్షల చెక్ ఇచ్చారు. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పుడు ఐదు వందల ఎకరాల్లో లే అవుట్ వేసే స్థాయికి వచ్చింది. మా ఈ కార్యక్రమానికి వచ్చిన వినాయక్ గారికి, మైత్రి రవి గారికి, శివ నిర్వాణ గారికి, సాయి రాజేష్ గారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్’ అని అన్నారు.