Dashvika: 'తత్వం'లో నటించడం లక్కీగా ఫీలవుతున్నాను: హీరోయిన్‌ దష్విక

'తత్వం'లో నటించడం లక్కీగా ఫీలవుతున్నాను: హీరోయిన్‌ దష్విక

'తత్వం'లో నటించడం లక్కీగా ఫీలవుతున్నాను: హీరోయిన్‌ దష్విక
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ  ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్‌ 2న  చిత్రం థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా సోమవారం  కథానాయిక దష్విక.కె. పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి. 

మీ నేపథ్యం?  
నా పేరు దష్విక.కె .నా స్వస్థలం వైజాగ్‌. ఇది నా తొలిసినిమా.. సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్న టైమ్‌లో ఈ సినిమా అవకావం వచ్చింది. తత్వం.. అడిషన్స చేసి సెలక్ట్‌ చేశారు. గతంలో నేను హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించాను. 

తత్వంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? 
ఫస్ట్‌ ప్రాజెక్ట్‌లోనే ఓ హీరోయిన్‌కు నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దొరకడం లక్కీగా ఫీలవుతున్నాను. నాకు ఈ మూవీలో కథ వినగానే ఇంట్రెస్టింగ్‌ గా అనిపించింది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్‌ ఉన్న పాత్ర ఇది. 

ట్రైలర్‌ చూస్తే మీ పాత్రలో నెగెటివ్‌ షేడ్స్‌ కనిపిస్తున్నాయి? 
నా పాత్రలో  గ్రే షేడ్స్‌ ఉంటుంది. బట్‌ అందరికి నచ్చే పాత్ర అది. ఇంతకు మించి ఇప్పుడు రివీల్‌ చేయకూడదు. 

తత్వం చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? 
సాఫ్ట్‌ కైండ్ ఆఫ్‌ గర్ల్‌.. హీరోకు సపోర్ట్‌కు ఉండే పాత్ర.  కిల్లర్‌ను అన్వేషణలో హీరోకు సపోర్ట్‌ చేస్తూ ఉంటే పాజిటివ్‌గా ఉండే పాత్ర నాది 

తత్వం సినిమా ఎలా ఉండబోతుంది. 
జనరల్‌గా మలయాలంలో ఇలాంటి స్టోరీలు వస్తుంటాయి. తెలుగులో కూడా ఇలాంటి కథతో సినిమా రావడం ఆనందంగా అనిపించింది. బోరింగ్‌గా ఉండదు. ఇదిమర్డర్‌ మిస్టరీ సస్పెన్స్‌.. ఎక్కడా ఎలాంటి పాయింటోలు ఉండాలో అవి ఉంటాయి. పర్సనల్‌గా నేను కూడా షై కాబట్టి ఈ సినిమాలో నా పాత్ర హెల్స్‌ అయ్యింది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ కొనసాగుతుంది. 

హీరోయిన్‌ అవ్వాలని ఎందుకు అనుకున్నారు. 
చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్‌ ఇష్టం. మూడో తరగతిలోనే నేను నటిని అవుతానని మా టీచర్‌కు చెప్పాను. సినిమా, మోడలింగ్‌ అంటే ఇష్టం. అమ్మ నాన్న కోరిక మేరకు స్టడీస్‌ కంప్లీట్‌ అయిన తరువాత సినిమాలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు  అమ్మ నాన్న సపోర్ట్‌ ఉంది.యాక్టింగ్‌ ట్రైనింగ్‌ మహతి బిక్షు దగ్గర తీసుకున్నాను. 

సినిమాల్లోకి వచ్చే ముందు  సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పిన మాటలు విని భయపడ్డారా? 
వచ్చే ముందు భయపడ్టాను. టెన్షన్‌ పెడ్డాను. అయితే  ఏదైనా మనం మేనేజ్‌ చేస్తూ  ఏ ఫీల్డ్‌లోనైనా ఎదగాలి అని అర్థమయింది.. నా విషయంలో అంతా కూలింగ్‌ గోయింగ్‌లా జరిగింది. బయట అనుకున్నంతా బ్యాడ్‌ ఏమీ లేదు


హీరో దినేష్ తేజ్‌ గురించి? 
దినేష్ వెరీ సపోర్టింగ్‌. యాక్షన్‌ సీక్వెన్సీలో నాకు బాగా సపోర్ట్‌ చేశారు. ఆయన పాత్ర ఈ సినిమాలో బాగుంటుంది. 

దర్శకుడు అర్జున్‌ కోలా గురించి? 
దర్శకుడు అర్జున్‌ కోలా చాలా సైలెంట్‌.. ఓ స్టాప్టవేర్‌ జాబ్‌ చేస్తున్నాడు. మూడు నెలలు లీవ్‌ తీసుకుని ఈ సినిమా చేశాడని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా క్లారిటి ఉన్న దర్శకుడు 

ఈ సినిమాలో ఇంకా హైలైట్‌గా ఏమిటి? 
కథ, కథనాలతో పాటు చేతన భరద్వాజ్‌ సంగీతం ఆర్‌ఆర్‌ హైలైట్‌గా ఉంటుంది. 

తత్వం టైటిల్‌కు సినిమాలో జస్టిఫికేషన్‌ ఉంటుందా? 

చాలా డిఫరెంట్‌ టైటిల్‌. మొదట్లో జనాలకు నచ్చుతుందో లేదొ అని అందరం  భయపడ్డాను. కానీ అందరి నుంచి మంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. టైటిల్‌లాగా సినిమా కూడా ఖచ్చితంగా డిఫరెంట్‌ గా ఉంది అని అక్టోబర్‌ 2 తరువాత అందరూ అంటారు. 

మీకు ఎలాంట సినిమాలు చేయాలంటే ఇష్టం? 
అన్ని తరహా పాత్రలు ముఖ్యంగా లవ్‌స్టోరీస్‌  చేయాలని ఉంది.నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటాను. 

మీ తదుపరి చిత్రాలు? 
నవంబరులో తమిళ సినిమా ప్రారంభమవుతుంది. తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. 
Dashvika
Dashvika interview
Tatvam

Watch Today's Deals on Amazon

More Press News