చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా టీజర్ రిలీజ్

చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా టీజర్ రిలీజ్
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో  హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై  ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది.

ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన రామ్మోహన్ నాయుడు చిత్ర దర్శక నిర్మాతలకు, ఇతర బృందానికి తన బెస్ట్ విశెస్ అందించారు.

"చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - అందమైన వైజాగ్ నేపథ్యంలో సాగే సరికొత్త ప్రేమ కథతో ఈ సినిమా రూపొందినట్లు టీజర్ తో తెలుస్తోంది. 'ఇది మామూలు ప్రేమ కథ కాదు, అమ్మ చెప్పిన ప్రేమ కథ, అమ్మ చెప్పిన ప్రేమ కథే కాదు అబ్బాయి ప్రేమ కథ, అబ్బాయి ప్రేమ కథే కాదు అమ్మాయి ప్రేమ కథ కూడా , ఇది మామూలు ప్రేమ కాదు. ఇది చకోర ప్రేమ కథ అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. జాబిల్లి చేరేందుకు ప్రయత్నించే చకోర పక్షిని సింబాలిక్ గా చెబుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేయడం కొత్తగా అనిపిస్తోంది. తన ప్రేయసి జూలీ ఎక్కడుందో వెతికేందుకు హీరో తీవ్ర ప్రయత్నాలు చేయడం టీజర్ లో చూపించారు. హీరో తన జూలీని చేరుకున్నాడా లేదా అనే 

క్యూరియాసిటీని టీజర్ క్రియేట్ చేసింది.
చకోర పక్షి ఒక యూనిక్ బర్డ్.. తన దాహాన్ని తీర్చుకునే ప్రాసెస్ లో స్వచ్ఛమైన వాన చినుకులనే త్రాగుతుంది తప్ప ఏది బడితే అది త్రాగదు... ఆ వర్షపు చినుకుల కోసం అప్పటివరకూ నిరీక్షిస్తూ ఉంటుంది... ఈ కథలో హీరో కూడా అంత  స్వచ్ఛమైన ప్రేమికుడు అని చెప్పడానికి ఈ చిత్రానికి చకోర టైటిల్ పెట్టారు. జాబిలిని చేరుకునే ప్రయత్నంలో చకోర పక్షి మరణిస్తుంది కానీ ఆ ప్రయత్నం ఆపదు...మరి తన ప్రేయసి జాబిలిని చేరుకునే ప్రయత్నంలో హీరో మరణించాడా లేదా తన అంతులేని ప్రేమతో మరణాన్నే జయించాడా అన్నదే కథ. లవ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిజం...వంటి అన్ని అంశాలు చూపిస్తూ కట్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Chakkora
Rammohan Naidu
Sravan

Watch Today's Deals on Amazon

More Press News