జీ తెలుగు మెగా ఈవెంట్ ‘బోనాల జాతరకి వస్తున్నాం’.. ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు!

జీ తెలుగు మెగా ఈవెంట్ ‘బోనాల జాతరకి వస్తున్నాం’.. ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు!
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల పండుగను హన్మకొండ వేదికగా జీ తెలుగు తారలు తమ అభిమానులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ‘బోనాల జాతరకి వస్తున్నాం’ ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 8న హన్మకొండలోని రెవెన్యూ కాలనీ, సుభేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో జీ తెలుగు నటీనటులు, ఇతర సెలబ్రిటీలు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలు, ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. తెలంగాణ బోనాల సంబరం ‘బోనాల జాతరకి వస్తున్నాం’ ఈ ఆదివారం (ఆగస్టు 16న) రాత్రి 7 గంటలకు, మీ జీ తెలుగులో ప్రసారం కానుంది.

ప్రముఖ యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం బోనాల పండుగను మరింత ప్రత్యేకంగా మార్చింది. జీ తెలుగు నటీనటుల అద్భుతమైన నృత్యప్రదర్శనలు, మ్యూజికల్ చైర్స్, పుష్అప్ ఛాలెంజ్, సరదా సంభాషణలతో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అంతులేని వినోదం, సంస్కృతి, సంప్రదాయాల కలయికగా సాగిన ‘బోనాల జాతరకి వస్తున్నాం’ కార్యక్రమాన్ని జీ తెలుగు వేదికగా మీరూ మిస్ కాకుండా చూసేయండి!

20260814fr6a7ed16e16ab7.jpg
Bonalu
Zee Telugu
Special Program

Watch Today's Deals on Amazon

More Press News