సగటు వ్యక్తి జీవితానికి ప్రతిరూపం 'శివ గాడి జింద‌గీ'!

సగటు వ్యక్తి జీవితానికి ప్రతిరూపం 'శివ గాడి జింద‌గీ'!
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రెడ్డి చందుపట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నిర్మాత సురేష్‌బాబు లాంచ్ చేశారు. సాంగ్‌ను అతిథులుగా పాల్గొన్న‌ రీల్ఆన్ సీఈఓ దాశరథం బిట్ల, రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ ప్రిన్సిపల్ పూల సందీప్ కుమార్ నాయుడు, ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు శివ మ‌ల్లాల‌ విడుద‌ల చేశారు. చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రతి సగటు మనిషి జీవితానికి ప్రతిరూపం!
కామెడీ, ఎమోషన్, డ్రామా, ఫ్రెండ్‌షిప్, లవ్ వంటి అన్ని రకాల వినోద అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఒక సామాన్య మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న రకరకాల పరిస్థితులు, సంఘటనలు, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం సాగనుంది. ప్రతీ సన్నివేశానికి ఒక బలమైన కారణం, ప్రతీ పాత్రకు ఒక ప్రాధాన్యత, ప్రతీ ఎమోషన్‌కు ఒక అనుబంధం ఉండేలా దర్శకుడు ఈ కథను మలచడం విశేషం.

లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు వినయ్ రెడ్డి చందుపట్ల మాట్లాడుతూ...
"'శివ గాడి జింద‌గీ' అనేది కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు... ఇది మన సమాజంలోని ప్రతి సగటు మనిషి జీవితానికి ఒక చక్కటి ప్రతిరూపం. జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు, స్నేహం, ప్రేమ, భావోద్వేగాలను చాలా సహజంగా చూపే ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్కరినీ ఈ కథ ఆకట్టుకుంటుంది. అలాగే నేను రాసిన పాటను భావయుక్తంగా పాడిన పావని వాస గారికి, అద్భుతమైన సంగీతాన్ని అందించిన సాయి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా టైటిల్, సాంగ్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ముఖ్య అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు" అని తెలిపారు.

నిర్మాత సింధు సూర్య మాట్లాడుతూ:
"ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. దర్శకుడు వినయ్ రెడ్డి గారు అనుకున్న కథను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. హీరో సచిన్ రామ్ ప్రతాప్, హీరోయిన్ హాసిని దేవరకొండలతో పాటు ప్రతీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. జేపీ రెడ్డి గారి ఛాయాగ్రహణం, సాయి గారి సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రేక్షకులందరికీ నచ్చేలా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం" అని అన్నారు.

ఈ సినిమాలో న‌టిస్తున్న వివారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా అంద‌రికి మంచి పేరు తీసుకు వ‌స్తుంది. ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంటూనే ప్ర‌తి జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రి గుండెను ట‌చ్ చేస్తుంది. " అని అన్నారు. 
Shiva gadi Zindagi
Sachin Ram Pratap
Hasini Devarakonda

Watch Today's Deals on Amazon

More Press News