"హ్రీం" మూవీ టీజర్ లాంఛ్
పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "హ్రీం". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. హారర్, మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీతో దర్శకుడు రాజేష్ రావూరి రూపొందిస్తున్నారు. ఈ రోజు "హ్రీం" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. దిగ్ధర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి మాట్లాడుతూ - హ్రీం మూవీ టీజర్ చాలా బాగుంది. నిర్మాతగా శివ మల్లాల ప్యాషన్ తెలుస్తోంది. ఆయన ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుని మరిన్ని పెద్ద చిత్రాలు నిర్మించాలి. హీరోయిన్ చమింద వర్మకు ఈ సినిమాతో పేరు రావాలి. అలాగే హీరో పవన్ కు కూడా ఆల్ ది బెస్ట్. రాజీవ్ కనకాల హీరో కావాల్సినవాడు. క్యారెక్టర్ యాక్టర్ గా ఇప్పుడు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ గా మారాడు. తనికెళ్ల భరణి గారు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇలాంటి అనుభవజ్ఞులైన నటులు ఈ సినిమాలో మనల్ని భయపెడుతూ ఎంటర్ టైన్ చేయబోతున్నారు. డైరెక్టర్ రాజేష్ రావూరి హ్రీం చిత్రంతో విజయాన్ని అందుకోవాలి. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ - హ్రీం అనే మంచి చిత్రాన్ని శివ మల్లాల నిర్మించడం సంతోషంగా ఉంది. టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు పేరు హ్రీం అయినా క్రీమ్ లా అనిపిస్తోంది. హీరోయిన్ చమింద వర్మ చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. రాజీవ్ కనకాల, బెనర్జీ, తనికెళ్ల భరణి..ఇలా కాస్టింగ్ అంతా బాగున్నారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు వచ్చినా ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ బెనర్జీ మాట్లాడుతూ - శివ నాకు మంచి మిత్రుడు. ఆయన ఈ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు నేనూ నటిస్తానని అన్నాను. ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగింది. కెమెరామెన్, డైరెక్టర్ రాజేష్, ప్రొడ్యూసర్ శివ మంచి కోఆర్డినేషన్ తో సినిమా చేశారు. ఏ సమస్య వచ్చినా వీళ్లంతా ఒక్కటిగా సాల్వ్ చేసుకునేవాళ్లు. ఈ చిత్రంలో నాకు హీరో పవన్, హీరోయిన్ చమిందతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సినిమా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అన్నారు.
యాక్టర్ రాజీవ్ కనకాల మాట్లాడుతూ - శివ ఈ సినిమాకు ఏ మంత్రం నేర్చుకున్నాడో గానీ తనకు కావాల్సిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరినీ మూవీలోకి తీసుకొచ్చాడు. నేను ఈ మూవీ ఓపెనింగ్ కు గెస్ట్ గా వచ్చాను. ఆ తర్వాత మూవీ కాస్టింగ్ లో ఒకరిగా మారిపోయాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. మూవీలో మిస్టిక్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ రాజేష్ తనకు ఏం కావాలో ఆ పర్ ఫార్మెన్స్ మా దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక పవన్, చమింద వర్మకు మంచి పేరొస్తుంది. వాళ్లు ఛాలెంజ్ గా తీసుకుని నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. హ్రీం టైటిల్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లి, థియేటర్స్ కు వారిని రప్పిస్తుంది. అన్నారు.
హీరో పవన్ తాతా మాట్లాడుతూ - శివ గారు ఒక తండ్రిలా నా బాగోగులు చూసుకున్నారు. సినిమా పరంగానే కాదు పర్సనల్ గా కూడా పవన్ కు ఇది చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టం. నేను కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. అవి చూసి డైరెక్టర్ రాజేష్ నాకు ఈ కథ చెప్పారు. ఇందులో లవ్, ఎమోషన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. పర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న కథ ఇది. ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ నటించారు. వారితో కలిసి నటించడం వల్ల నా యాక్టింగ్ స్కిల్స్ మెరుగయ్యాయి. హీరోయిన్ చమింద వర్మతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. మా టెక్నికల్ టీమ్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నారు. వారు ఈ సినిమాకు ఇచ్చిన ఔట్ పుట్ త్వరలో స్క్రీన్ మీద మీరంతా చూస్తారు. హ్రీం సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ శివ మల్లాల మాట్లాడుతూ - దాదాపు 25 ఏళ్లుగా జర్నలిజం కెరీర్ కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీ ముందుకు వస్తున్నాను. నాకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. నేనే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లాను. అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా అడుగేశాను. నేను కిందపడినా ఎంత లోతుకు పడతాను అని ఆలోచించే రిస్క్ చేశాను. మా డైరెక్టర్, డీవోపీ గెరిల్లా టైప్ లో షూట్ చేసి మంచి ఔట్ పుట్ ఇస్తామని చెప్పడంతో నేను ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాను. రాజీవ్ కనకాల, బెనర్జీ గారు, భద్రమ్..ఇలా చాలా మంది సపోర్ట్ చేయడం వల్లే కాంపాక్ట్ బడ్జెట్ లో ఈ సినిమా చేయగలిగాం. వీళ్లంతా దాదాపు 150 కిలోమీటర్లు జర్నీ చేసి మా మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. వరంగల్ దగ్గర పెద పెండ్యాల అనే ఊరిలో షూటింగ్ చేశాం. ఆ ఊరి ప్రజలు కూడా చాలా సహకరించారు. ఇదంతా నేను కాబట్టి అయ్యింది, వేరే ప్రొడ్యూసర్ అయ్యింటే చాలా ఖర్చయ్యేది. సినిమాలో 20 నిమిషాల గ్రాఫిక్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. హీరోయిన్ చమింద వర్మ దుబాయ్ నుంచి వచ్చి మా సినిమా కోసం ఏమాత్రం రెమ్యునరేషన్ ఆశించకుండా నటించింది. ఆమె ఈ సినిమాలో ఎంతో తపనతో యాక్ట్ చేసింది. ఆమెకు ఆమె మదర్ శైలజ గారికి థ్యాంక్స్. పవన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. మన మీడియా నుంచి వచ్చిన పర్సన్ పవన్. అతను మన జర్నలిస్ట్స్ అసోసియేషన్ లో మెంబర్. ఇకపై యాక్టర్ గా అతని జర్నీ బాగుండాలని కోరుకుంటున్నా. అన్నారు