రాజమండ్రిలో పవన్ టూర్... ఎల్లుండి పడవ ప్రయాణం!
- రేపు సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్
- రేపు సాయంత్రం అక్కడే బస
- పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించనున్న పవన్ కల్యాణ్
సోమవారం ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధిలతో సమావేశమవుతారు.
పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో, ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. అనంతరం మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
గోదావరి పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాలుష్యరహిత పుష్కరాల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.