నీట్ 2026 ఫీజు రిఫండ్ ప్రారంభం.. బ్యాంకు వివరాలు ఇలా నమోదు చేసుకోండి!
- ఈ నెల 27లోగా ఆన్‌లైన్‌లో బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాలన్న ఎన్‌టీఏ
- అధిక ట్రాఫిక్ కారణంగా పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు
- నకిలీ రీఫండ్ సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని ఎన్‌టీఏ హెచ్చరిక
- జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
బ్యాంకు వివరాలు సమర్పించే విధానం:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ `neet.nta.nic.in` ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో కనిపించే "NEET 2026 Refund Portal" లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- తరువాత బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంకు పేరు వంటి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
- అవసరమైతే రద్దు చేసిన చెక్కు (cancelled cheque) కాపీని అప్‌లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు సరిచూసుకుని, రిఫండ్ రిక్వెస్ట్ ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
- చివరగా భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
ప్రస్తుతం ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు పోర్టల్‌ను యాక్సెస్ చేస్తుండటంతో సర్వర్‌పై అధిక భారం పడి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లాగిన్ ఎర్రర్‌లు, ఓటీపీ ఆలస్యం కావడం, సర్వర్ డౌన్ అవ్వడం వంటి సమస్యలను చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్‌డేటెడ్ బ్రౌజర్‌ను ఉపయోగించాలని, రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో ప్రయత్నించాలని ఎన్‌టీఏ సూచించింది. అలాగే, నకిలీ రీఫండ్ సందేశాలు లేదా ఫేక్ పోర్టల్స్‌ను నమ్మవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని హెచ్చరించింది.
కాగా, నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌ను జూన్ 21న నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.