స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల
- వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారన్న షర్మిల
- బటన్లు నొక్కినంత మాత్రాన మళ్లీ సీఎంలు కాలేరని ఎద్దేవా
- వైఎస్సార్ ఆశయాలను నాశనం చేశారని మండిపాటు
తండ్రి ఆశయాల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక ఆ ఆశయాలనే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ప్రజలపై భారాలు మోపిన వైసీపీ నేతలు, ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ సీఎం అయ్యాక కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుతూ, అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.