ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్
- రెండో రోజు చురుగ్గా సాగుతున్న నాదెండ్ల మనోహర్ ఢిల్లీ టూర్
- కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తో భేటీ
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం
అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మర్యాదపూర్వకంగా భేటీ అయి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు, సరుకులు అందించేందుకు కేంద్ర సహకారాన్ని కోరారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని, పౌరసరఫరాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు వేగవంతం చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ చర్చలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.